గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: శనివారం, 25 ఏప్రియల్ 2015 (07:31 IST)

వాటికన్ పై అల్ ఖైదా ఎందుకు కన్నేసింది..? ఎక్కువ ప్రాణ నష్టం కలింగించవచ్చాననా..?

పవిత్ర పుణ్యక్షేత్రం వాటికన్ సిటీపై దాడికి అల్ ఖైదా కన్నేసిందా..? అక్కడ మారణహోమం సృష్టించాలని ఉందా అని అంటే, అవుననే చెబుతున్నాయి అమెరికా నిఘా వర్గాలు. ఎక్కడ ఎక్కువ ప్రాణ నష్టం సంభవిస్తోందో అక్కడ దాడులు చేయాలని, ఎక్కడ దాడి చేస్తే ప్రపంచ సంచలనం అవుతుంతో అక్కడే మారణహోమం చేయాలని ఆ సంస్థ భావించడం వలననే వాటికన్ సిటీపై దృష్టి సారించినట్లు నిఘావర్గాల విశ్లేషణలలో తేలుతోంది. 
 
ఇటలీలో పట్టుబడిన కొంతమంది అనుమానిత ఉగ్రవాదులను విచారించినప్పుడు ఈ విషయం బయటపడింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్లలో దాడులకు కుట్ర పన్నడంతో పాటు అరెస్టయిన నిందితులు వాటికన్ సిటీని కూడా లక్ష్యంగా చేసుకున్నారని కాగ్లియారీ చీఫ్ ప్రాసిక్యూటర్ మౌరో మురా తెలిపారు.
 
ఇటలీలో దేశవ్యాప్తంగా చేసిన సోదాల్లో 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లందరికీ అల్ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. అరెస్టయిన వారిలో ఓ ఆధ్యాత్మిక గురువు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్లు కాకుండా మరికొందరు ఇప్పటికే అక్కడి నుంచి పారిపోయినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.