శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (11:47 IST)

ఇమ్రాన్ జీ.. పుల్వామా ఉగ్రదాడి మా పనే : జైషే మహమ్మద్

పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తముందంటూ భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించి కొన్ని గంటలు కాకముందే తీవ్రవాద సంస్థ జైష్ మహహ్మద్ తేరుకోలేని ఝులక్ ఇచ్చింది. పుల్వామా ఉగ్రదాడి తమపనేనంటూ రెండో వీడియో ఆధారాన్ని విడుదల చేసింది. 
 
పైగా, ఇమ్రాన్ ఖాన్ అడుగుతున్న అన్ని రకాల ఆధారాలను వీడియో ద్వారా బయటపెట్టి.. సాక్ష్యాలను తనకు తానే అందించింది. పుల్వామా ఉగ్రదాడి తమ పనే అంటూ రెండో వీడియోను మంగళవారం విడుదల చేసింది. అంతేకాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడి చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని వీడియోలో పేర్కొనడం గమనర్హం. ఈ వీడియోతో ఇమ్రాన్ ఖాన్ ఇపుడు డైలామాలో పడ్డారు. 
 
కాగా, పుల్వామా ఉగ్రదాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఇమ్రాన్ ఖాన్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధంలేదని, ఒక దేశంలో మరో దేశం ఇలాంటి ఆరోపణలు చేయడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. తమ దేశం కూడా స్వయంగా ఉగ్ర బాధిత దేశమేనని వాపోయారు. తమపై నిందలు వేస్తున్న భారత్.. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి రుజువులు ఉంటే చూపాలని పదే పదే కోరారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే జైషే... దాడులు తమ పనే అంటూ రెండో వీడియో విడుదల చేసింది.