శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (14:04 IST)

భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగం కాదా?: పాక్ వాగుడు.. మోడీ ఏం చేస్తారో?

దాయాది దేశం పాకిస్థాన్ హద్దులు దాటుతోంది. నోటికొచ్చినట్టుగా ఇష్టానుసారంగా వాగుతోంది. చివరికి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదన్న మాట పాపిష్టి పాకిస్థాన్ నోటి నుంచి వచ్చింది. ఇంతకాలం జమ్మూ-కాశ్మీర్‌ని వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ వచ్చిన పాకిస్థాన్ ఇప్పుడు ఎవరి అండ చూసుకునే ఏమో తెలియదు కానీ, భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం కాదన్న మాటలు మాట్లాడుతోంది.
 
కాశ్మీర్‌లోని వేర్పాటువాదులైన హురియత్ నాయకులతో భారతదేశంలోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చర్చలు జరపడంతో భారత్ ఆగ్రహించింది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దాంతో పాకిస్థాన్‌ ఈ పొగరుబోతు మాటలు మాట్లాడుతోంది. 
 
పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తస్నిం అస్లాం స్పందిస్తూ ‘కాశ్మీర్ వేర్పాటు వాదులతో మాట్లాడటం భారతదేశ ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం కాదు. చర్చల విరమణకు భారతదేశం దీన్నొక సాకుగా తీసుకుంటోంది. భారతదేశం అనుకుంటున్నట్టుగా కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం కాదు. అదొక వివాదాస్పద భూభాగం. దానిపై ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాలున్నాయి’ అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ వ్యాఖ్యల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఈ వ్యాఖ్యల ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.