గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 18 మార్చి 2018 (14:50 IST)

పాకిస్థాన్ బుద్ధి మారదా? కాల్పుల ఉల్లంఘన.. ఐదుగురు పౌరుల మృతి

పాకిస్థాన్ బుద్ధి మారలేదు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించడం ద్వారా పాక్ తన వంకర బుద్ధిని మరోసారి మార్చుకోలేదని నిరూపించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస

పాకిస్థాన్ బుద్ధి మారలేదు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించడం ద్వారా పాక్ తన వంకర బుద్ధిని మరోసారి మార్చుకోలేదని నిరూపించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తూనే.. 36 గంటల్లో మూడు సార్లు కాల్పులకు తెగబడింది.  జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు.
 
వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో తొమ్మిది బీఎస్ఎఫ్ ఔట్ పోస్టులు లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం కాల్పులకు దిగింది. మోర్టార్ షెల్స్, హెవీ ఫైరింగ్‌తో ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. కొన్ని పశువులు మృతి చెందాయి. 
 
శుక్రవారం నుంచి కాల్పులు మొదలెట్టిన పాక్ సైన్యం.. శనివారం కూడా కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఓ భారత పౌరుడు మరణించగా... కాల్పుల్లో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పాక్ కాల్పులకు భారత జవాన్లు ప్రతి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన కొన్ని వాహనాలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. భారత్-పాక్ కాల్పుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.