గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:20 IST)

చక్రాలు లేని రైలు గంటకు 603 కి.మీ వేగంతో ప్రయాణించింది.. ఎక్కడ?

సాధారణంగా చక్రాలు ఉండే రైలులో ప్రయాణించాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడివున్నాయి. దీనికి కారణం ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకోవడం. పైగా.. ఈ రైళ్లు గంటకు 50 నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణిస్తే మహా స్పీడు పోతోందిరా అంటారు. ఇది మన భారతీయ రైళ్ల పరిస్థితి.
 
కానీ, చక్రాలు లేని రైలు ఒకటి గంటకు ఏకంగా 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే.. అందులోని ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతారా? చేరుతారనే అంటోంది జపాన్. అత్యాధునికమైన, హై స్పీడ్ రైళ్లకు పుట్టినిల్లు జపాన్. తాజాగా, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అనదగ్గ టెక్నాలజీ, డిజైనింగ్‌తో తయారైన మాగ్లెవ్ (మాగ్నెటిక్ లెవిటేషన్) ట్రైన్ ప్రపంచ రికార్డు స్పీడ్ నమోదు చేసింది. 
 
మొత్తం ఏడు బోగీలున్న మాగ్లెవ్ రైలు గంటకు 603 కిలోమీటర్ల వేగంతో పయనించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2003లో మాగ్లెవ్ రైలు 581 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా అప్పట్లోనే కాదు ఇప్పటి వరకు ఓ రికార్డుగా ఉంది. ఈ రైలు ఇపుడు గంటకు 590 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి ఆ రికార్డును బద్ధలు కొట్టింది. మౌంట్ ఫుజి వద్ద ఈ ట్రయల్ రన్ నిర్వహించారు.