గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (14:13 IST)

జపాన్‌లో రాత్రిపూట ఆఫీసుల్లో లైట్లు ఆపాల్సిందే.. వారంలో మూడు రోజులు సెలవు.. యాహూ

జపాన్ ప్రజలు కష్టజీవులు డబ్బు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. జపాన్‌లో ఉద్యోగులు కష్టపడినంతగా ఏ దేశంలోనూ ఉద్యోగులు శ్రమించరనే చెప్పాలి. ఆఫీసుల్లోనే పనిచేసుకుంటూ.. అక్కడే తిని.. అక్కడే నిద్రపోయే ఉద్యో

జపాన్ ప్రజలు కష్టజీవులు డబ్బు కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. జపాన్‌లో ఉద్యోగులు కష్టపడినంతగా ఏ దేశంలోనూ ఉద్యోగులు శ్రమించరనే చెప్పాలి. ఆఫీసుల్లోనే పనిచేసుకుంటూ.. అక్కడే తిని.. అక్కడే నిద్రపోయే ఉద్యోగులకు ఇకపై ఉపశమనం లభించనుంది. ఈ క్రమంలో జపాన్‌లోని యాహూ సంస్థ తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకి వారంలో మూడు రోజులు సెలవు ఇవ్వాలని నిర్ణయించుకుంది. 
 
ఆఫీసుల్లోనే నిద్రపోతూ.. ఓవర్‌టైమ్ చేసుకుంటూ గడిపే వారిలో మానసిక ప్రశాంతత కొరవడుతోంది. ఇటీవల ఒక యాడ్‌ ఏజెన్సీలో పనిచేసే 24ఏళ్ల యువతి ఉద్యోగంలో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే దాన్ని జపాన్‌లో 'కరోషి'గా పిలుస్తారు. ఇలాంటి సంఘటనలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు రాత్రిళ్లు ఆఫీసుల్లో లైట్లు ఆఫ్‌ చేయాలని సంస్థలకు ఆదేశాలిచ్చింది. వచ్చే నెల నుంచి ఉద్యోగులు ప్రతినెల చివరి శుక్రవారం తొందరగా ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనుంది.
 
అయితే.. జపాన్‌లోని యాహూ సంస్థ మరో అడుగుముందుకేసి వారంలో మూడురోజులు సెలవు దినాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2020నాటికి తమ ఉద్యోగులకు దీన్ని అమలు చేయాలని నిర్ణయించుకుందట. దీని వల్ల ఉద్యోగులకు ప్రశాంతత లభించడమే కాకుండా.. చేసే పనిని మరింత బాగా ఎలా చేయాలో నేర్చుకుంటారని... పనితనం మెరుగవుతుందని యాహూ సంస్థ తెలిపింది.