శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (16:47 IST)

కార్గోషిప్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జపాన్ విస్కీ.. తాగేందుకా?

మానవ రహిత కార్గోషిప్‌లో అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి జపాన్ విస్కీ చేరుకుంది. ఈ విస్కీ వ్యోమగాములు తాగేందుకు కాదని.. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేని చోట ఆల్కహాల్‌లో జరిగే మార్పులను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు దీనిని పంపారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీటిని అందజేసిన అనంతరం భూమికి ఆ వ్యోమనౌక బయల్దేరింది. సెప్టెంబరులో ఈ మానవ రహిత కార్గోషిప్ భూమికి చేరుకుంది. ఈ కార్గో షిప్ ద్వారా వ్యోమగాములకు అవసరమయ్యే నీరు, ఆహారం, దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులను, వాటితో పాటు పరిశోధనకు అవసరమైన జపాన్ కంపెనీకి చెందిన విస్కీని కూడా పంపించారు.