గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (14:06 IST)

నేను లేకుండా ఆమె ఎన్నో రాత్రులు గడిపింది.. అందుకే ప్రధాని పదవికి రిజైన్ : న్యూజిలాండ్ పీఎం

న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాన్‌కీ తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబ కారణాలతో తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మాటలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతి, ఆశ్చర్యానికి గురిచేశా

న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాన్‌కీ తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబ కారణాలతో తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మాటలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతి, ఆశ్చర్యానికి గురిచేశాయి. అంతేనా తాను లేకుండా ఆమె ఎన్నో రాత్రులు గడిపిందనీ, ఇకపై కూడా ఆమెను ఒంటరిగా వదిలి ఉండలేనని ఆయన ప్రకటించారు.
 
న్యూజిలాండ్‌ ప్రధానిగా జాన్‌కీ కొనసాగుతున్నారు. ఈయన ప్రధానిగా ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్నారు. అయితే, ఆయన ఒక్కసారిగా ప్రధాని పదవితోపాటు పార్టీ పదవులకు స్వస్తిచెప్పారు. కుటుంబ కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాయి. 
 
అదేసమయంలో తన భార్య బ్రోనాగ్‌ అల్టిమేటం కారణంగానే రాజీనామా చేసినట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఇక ముందు ఎక్కువ సమయం తాను కుటుంబంతో గడపడాన్ని ఆమె సంతోషిస్తుందని మాత్రం పేర్కొన్నారు. తన వల్ల కుటుంబం చాలా కోల్పోయిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని జాన్‌ తెలిపారు.
 
'నేను లేకుండా ఎన్నో రాత్రులు ఆమె ఒంటరిగా గడిపింది. చాలా ముఖ్య కార్యక్రమాలకు నేను వెళ్లలేకపోయాను. కుమార్తె స్టెఫీ, కుమారుడు మ్యాక్స్‌ కూడా పెద్దవాళ్లయ్యారు. నా బాధ్యతలు గుర్తెరిగి వాళ్లిద్దరూ మసలుకున్నారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటా' అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. తమ వైవాహిక జీవితం ఇటీవలే 32 ఏళ్లు పూర్తిచేసుకుందని.. ఇకపై పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యుల కోసమే వెచ్చిస్తానని ఆయన పేర్కొన్నారు.