గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (12:16 IST)

ప్లే బాయ్ మేగజైన్‌కు కష్టాలు.. ఓవైపు విమర్శలు, మరోవైపు పొగడ్తలు.. ఓ ముస్లిం మోడల్‌?

ప్లే బాయ్ మేగజైన్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. సాఫ్ట్ పోర్న్ మ్యాగజైన్‌గా గుర్తింపు పొందిన ఈ పత్రిక ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ పత్రిక చరిత్రలో తొలిసారిగా హిజబ్ (హెడ్ స్కార్ఫ

ప్లే బాయ్ మేగజైన్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. సాఫ్ట్ పోర్న్ మ్యాగజైన్‌గా గుర్తింపు పొందిన ఈ పత్రిక ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ పత్రిక చరిత్రలో తొలిసారిగా హిజబ్ (హెడ్ స్కార్ఫ్) ధరించిన ఓ ముస్లిం మోడల్‌ను ప్రచురించగా, అటు పొగడ్తలు, ఇటు విమర్శలు వస్తున్నాయి.

అశ్లీలతకు కాస్తంత దూరమైన తర్వాత ఈ మ్యాగజైన్ ఇటువంటి ఫోటోను ప్రచురించడం, యువతలో, ముఖ్యంగా జీవితంలో ఎదగాలనుకునే ముస్లిం మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని పలువురు వ్యాఖ్యానిస్తుండగా, ముస్లిం వర్గాలు మాత్రం మండిపడుతున్నాయి. 
 
అక్టోబర్ మాసపు 'రెనిగేడ్స్' ఎడిషన్ లో 22 ఏళ్ల అమెరికన్ జర్నలిస్ట్ నూర్ తాగౌరీ, బ్లాక్ లెదర్ జాకెట్, జీన్స్, స్నీకర్స్‌తో పాటు హిజబ్ ధరించిన చిత్రాన్ని ప్రచురిస్తూ, ఆమెను 'బదాస్ యాక్టివిస్ట్' అని సంబోధించింది. లిబియా నుంచి వచ్చిన నూర్ ఏకైక లక్ష్యం, యూఎస్ కమర్షియల్ టెలివిజన్ రంగంలో హిజబ్ ధరించి యాంకరింగ్ చేసిన తొలి యాంకర్ నిలవడమేనట. ప్లేబాయ్ అంటేనే శృంగారం, అశ్లీలం, అసభ్యమని ఆన్ లైన్ మేగజైన్ 'ది ముస్లిం వైబ్' ఫైర్ అయ్యింది.   
 
ఇదిలా ఉంటే.. ఇన్నాళ్ళు అందమైన అమ్మాయిల నగ్న చిత్రాలతో కుర్రకారుతో పాటు పలువురిని ఆకర్షించి ప్రపంచ వ్యాప్తంగా విశేష కీర్తి ప్రతిష్టలను సముపార్జించిన ఈ మేగజైన్ ఇకనుండి అమ్మాయిల నగ్న చిత్రాలను ముఖ చిత్రంగా వేసేది లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.

దాదాపు 63ఏళ్ళు గా అమ్మాయిల నగ్న చిత్రాలతో సంచలనం సృష్టిస్తూ వచ్చిన ప్లే బాయ్ అందరి మనసులను గెలుచుకుంది. కానీ ఇకపై నగ్న చిత్రాలు ప్రచురించరని తెలియగానే పాఠకులు డీలాపడిపోతున్నారు.