Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా ఇంటి కోర్టుకువచ్చి వాదనలు వినిపించండి: సుప్రీం సీజేకు జస్టిస్ కర్ణన్ సుమోటో ఉత్తర్వు

శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (10:29 IST)

Widgets Magazine

కోల్‌కతా హైకోర్టు జడ్జి కర్ణన్ మరోమారు ధిక్కార స్వరం వినిపించారు. తనను అవమానించి... ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఉల్లఘించారంటూ ఆయన గాండ్రించారు. అందువల్ల ఇంచికోర్టుకు వచ్చి నా ఎదుట నిలబడం వాదనలు వినిపించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా ఆరుగురు సుప్రీం జడ్డీలకో జస్టీస్ కర్ణన్ తన నివాసం నుంచి సుమోటో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జస్టిస్ కర్ణన్, సుప్రీంకోర్టు మధ్య వివాదం మరింతగా ముదిరింది. 
 
సుప్రీంకోర్టు గతంలో జస్టిస్ కర్ణన్‌పై కోర్టుధిక్కార నేరం కింద బెయిల్‌తో కూడిన అరెస్టు వారెంట్‌ను జారీ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు జస్టిస్ కర్ణన్ ఏకంగా చీఫ్‌ జస్టిస్, ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీన తన ఇంటిలో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ కోర్టులో హాజరుకావాలంటూ ఆదేశించారు. 
 
ఇలా ఒక హైకోర్టు జడ్జీ కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టు ఎదుట హాజరుకావడం భారత న్యాయవ్యవస్థ చరిత్రలోఇదే మొదటిసారి కాగా.. చీఫ్‌ జస్టిస్‌తోసహా ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తనముందు హాజరుకావాలని హైకోర్టు జడ్జీ నోటీసులు ఇవ్వడం కూడా భారత న్యాయవ్యవస్థలో ప్రథమం. 
 
గురువారం కోల్‌కతాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జస్టిస్ కర్ణన్ మాట్లాడుతూ, మార్చి 31వ తేదీన తాను సుప్రీంకోర్టుకు హాజరైనప్పుడు ఏడుగురు సభ్యుల ధర్మాసనం తనను అవమానించిందని ఆరోపించారు. దళితుడనైనందుకే తనను ఉద్దేశపూర్వకంగా వేధించిందని పేర్కొన్నారు. నేను మార్చి 31వ తేదీన సుప్రీంకోర్టుకు హాజరైనప్పుడు.. నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది అని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహర్ ప్రశ్నించారు.
 
మిగతా న్యాయమూర్తులు కూడా అలాగే వ్యవహరించారు. ఇది ఓపెన్ కోర్టులో నన్ను అవమానించడమే అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారంటూ సుమోటో జ్యుడీషియల్ ఆర్డర్‌ను జారీచేశారు. ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 11.30 గంటలకు రెసిడెన్షియల్ కోర్టుకు హాజరై వాదనలు వినిపించాలని పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శృంగారంలో దూకుడు... ఫ్రాక్చరైన పురుషాంగం... సర్జరీతో సరిచేసిన వైద్యులు...

చైనాకు చెందిన ఓ వ్యక్తికి వింత పరిస్థితి ఎదురైంది. తన భార్యతో విచ్చలవిడిగా శృంగారానికి ...

news

ఏం కష్టమో.. నష్టమో... హైదరాబాద్‌లో యువ వైద్యురాలి బలవన్మరణం

హైదరాబాద్‌లో ఓ యువ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ, ...

news

అర్థరాత్రి ఘోర ప్రమాదం... తన కారులో ఆస్పత్రికి తరలించిన కేటీఆర్...

హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరి ఆర్‌టీఏ కార్యాలయం వద్ద గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ...

news

ఐసిస్‌పై మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్... అమెరికా ప్రయోగం... నేలపై పడిందో అంతే...

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)పై ...

Widgets Magazine