శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (17:19 IST)

మరణశిక్షల అమలుకు విషం కొరత.. ఎలక్ట్రిక్ చైర్ల కోసం కొత్త బిల్లు!

మరణశిక్షల్ని అమలు చేసేందుకు అవసరమైన విషం అందుబాటులో ఉండకపోవడంతో అమెరికాలోని వర్జీనియా ప్రజా ప్రతినిధులు కొత్త బిల్లును ఆమోదించనున్నారు. విషం రసాయనాలు అందుబాటులో ఉండకపోవడంతో ఎలక్ట్రిక్ చైర్లను వాడే విధానానికి అనుమతిస్తూ.. అమెరికా కొత్త బిల్లును ఆమోదించనున్నారు.  
 
విషంతో కూడిన ఇంజక్షన్ ఇస్తే, మెల్లగా మత్తులోకి జారుకుని మరణిస్తారని, దీనివల్ల అతి తక్కువ బాధ, మరణానికి చేరువయ్యేందుకు తక్కువ సమయం పడుతుందనే భావనలో చాలా దేశాలు ఈ విధానాన్నే అమలు చేస్తున్నాయి. 
 
అయితే వర్జీనియాలో మరణశిక్షలను విషపు (లెథల్) ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా అమలు చేస్తుండగా, ఇటీవలి కాలంలో ఈ తరహా ఔషధాల లభ్యత మందగించింది. దీంతో వర్జీనియా 'హౌస్ ఆఫ్ డెలిగేట్స్' ఎలక్ట్రిఫికేషన్ వైపు నడుస్తున్నారు. "కోర్టుల నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉండటంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టిన జాక్సన్ హెచ్ మిల్లర్ వ్యాఖ్యానించారు.