శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం: మార్చి 16.. ఇండియన్ అమెరికన్ అప్రిసియేషన్ డే..

శుక్రవారం, 17 మార్చి 2017 (15:48 IST)

జాత్యంహకార దాడులకు బలైపోయిన కూచిభొట్ల శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. మార్చి 16వ, తేదిని ఇండియన్ అమెరికన్ అప్రిసియేషన్ రోజుగా జరుపుకోవాలని కాన్సాస్ గుర్తించింది. అమెరికాలో నావిక దళంలో పనిచేసిన మాజీ సైనికోద్యోగి ఆడమ్ ప్యూరింటన్ ఓ బార్‌లో ఫిబ్రవరి 22న శ్రీనివాస్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ మరణించగా, అలోక్ రెడ్డి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 
 
అయితే శ్రీనివాస్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో జాత్యంహకార దాడులు పునరావృతం కానివ్వబోమని, ఈ హింసను ఖండిస్తున్నట్లు కన్సాస్ గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ తీవ్రంగా ఖండించారు. అయితే హింసను కన్సాస్ గవర్నర్ శ్యామ్ బ్రౌన్ బ్యాక్ తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హమీ ఇచ్చారు. అయితే కన్సాస్ మంచి ప్రదేశంగా మారడంలో ఇండియన్ల పాత్రను మరువలేనిదని కొనియాడారు. భారతీయులకు తాము ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. 
 
ప్యూరిటన్ దాడి నుండి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన అమెరికన్ ఇయాన్ గ్రిల్లియాంట్‌‍ను బ్రౌన్ బ్యాక్ అభినందనలతో ముంచెత్తారు. అలోక్ రెడ్డి, గ్రల్లియాంట్ లు త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకొన్నారు. ప్రతి ఏటా మార్చి 16వ, తేదిన ఇండియన్, అమెరికన్ అప్రిషియేషన్ దినోత్సవంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బావపై రంగు అనుకుని టర్పెంటాయిల్ చల్లేసిన మరదలు-పొయ్యి పక్కనే నిల్చోవడంతో బావ మృతి..

సింగరేణి కాలనీలో హోలీ పండుగ నాడు విషాధ ఘటన చోటుచేసుకుంది. బావపై మరదలు రంగు చల్లాలనుకుంది. ...

news

జైల్లో పడ్డ రేప్ మంత్రి... పిచ్చివాడయిపోతాడేమో? అమిత్ షా అన్నంత పనీ చేశారు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంటే అత్యాచారాలకు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పాల్సి వచ్చింది అప్పట్లో. ...

news

కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తే గెలుపే.. సీఎం కావడం ఖాయం.. జోస్యం

తమిళనాడు రాజకీయాల్లో సినీ లెజెండ్ కమల్ హాసన్ అడుగెడితే తప్పకుండా ఆయన సీఎం అవుతారని ...

news

నువ్వు జయలలిత-శోభన్ బాబు కొడుకువా? అబద్ధమని తేలితే కుళ్లబొడుస్తారు... కోర్టు ఫైర్

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత ఆమె కుమార్తెనంటూ, కుమారుడినంటూ ఇటీవల కొందరు ...