గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (13:03 IST)

కార్తీక్ వెడ్స్ సందీప్.. హిందూ సంప్రదాయంతో ఏకమైన ఎన్‌ఆర్‌ఐ 'గే'లు..!

మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. అయితే ఇక్కడ వివాహం చేసుకున్నది అమ్మాయి, అబ్బాయి కాదు. ఇద్దరు అబ్బాయిలే కావడం విశేషం. అమెరికాలోని కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్లయిన కార్తీక్, సందీప్‌లు హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురంలో నివాసి, అమెరికాలో సెటిలైన సందీప్‌, అమెరికాలోనే పుట్టి పెరిగిన కార్తీక్‌‌లు అచ్చ మలయాళీ సంప్రదాయంలో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరిద్దరికీ మూడేళ్ల క్రితం ఒక డేటింగ్ వెబ్ సైట్‌లో పరిచయం అయిందట.
 
అప్పటి నుంచి ప్రేమించుకుంటున్న వీరిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు చెబితే, మొదట దిగ్భ్రాతి వ్యక్తం చేసినా, ఆ తరువాత అంగీకరించారు. 
 
వీరి వివాహం సాధారణ పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా ఘనంగా జరుగగా, బంధుమిత్రులు కానుకలు ఇచ్చిమరీ ఆశీర్వదించారు. వీరి వివాహం సామాజిక మాధ్యమాల్లో బయటకు రాగా, ప్రసుతం పెళ్లి ఫోటోలు చక్కర్లు కొడుతూ, మరింత మంది 'గే'లకు స్ఫూర్తిగా నిలుస్తోందట.