గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 4 మే 2015 (14:27 IST)

అది క్రిస్టియానిటికి వ్యతిరేకం.. అందుకే నిషిద్ధం... విలియమ్ రూటో స్పష్టం..!

ప్రకృతి విరుద్ధమైనప్పటికీ పలు దేశాలు స్వలింగ సంపర్కానికి మద్దతు తెలుపుతున్నాయి. అయితే తాము స్వలింగ సంపర్కానికి వ్యతిరేకం అని కెన్యా ఉపాధ్యక్షుడు విలియమ్ రూటో స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు తాము ఏమాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పారు. అది మానవ నైజానికి పూర్తిగా విరుద్ధమైన చర్య అని, ముఖ్యంగా క్రిస్టియానిటికి వ్యతిరేకమని అందువలనే తాము నిషేధిస్తున్నట్టు తెలిపారు. 

తాము మతపెద్దలు చెప్పిన అంశాలకు కట్టుబడి ఉంటామని, తమ నమ్మకాలు, విశ్వాసాలు కాపాడుకుంటామని అన్నారు. అందుకే తమ సమాజంలో స్వలింగ సంపర్కానికి అనుమతించడం లేదని వివరించారు. అది తమ సంస్కృతిని, సంప్రదాయాలను, మతాన్ని దెబ్బతీస్తుంది రూటో ఆందోళన వ్యక్తం చేశారు. తమ లాగే స్వలింగ సంపర్కానికి వ్యతిరేకత తెలిపే మత సంస్థలకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు.