శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 మే 2015 (17:59 IST)

ఒబామా కుమార్తె మలియాపై మనసుపడ్డ లాయర్!: కన్యాశుల్కంగా..

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియాపై కెన్యాకు చెందిన ఓ యువ లాయర్ మనసుపారేసుకున్నాడు. ఫెలిక్స్ కిప్రొనో అనే ఈ న్యాయవాది మలియాను తనకిచ్చి పెళ్లి చేసేట్టయితే కన్యాశుల్కం కూడా ఇచ్చుకుంటానని చెప్పుకొచ్చాడు. పిల్లనిస్తే 70 గొర్రెలు, 50 గోవులు, 30 మేకలను మామకు సమర్పించుకుంటాడట. 
 
తన ప్రేమ స్వచ్ఛమైనదని కిప్రోనో నొక్కి చెప్పాడు. జీవితంలో తనకు డబ్బే ముఖ్యం కాదని అంటున్నాడు. 2008లోనే మలియాతో వన్ సైడ్ లవ్‌లో పడ్డానని తెలిపాడు. నిజం చెప్పాలంటే, తానింతవరకు ఎవరితోనూ డేటింగ్ చేయలేదని, ఆమెకు విధేయుడిగా మసలుకుంటానని స్పష్టం చేశాడు.

జూలైలో ఒబామా కెన్యా రానున్న సందర్భంగా ఆయనతో మాట్లాడతానని తెలిపాడు. మలియాను కూడా కెన్యా పర్యటనకు తీసుకురమ్మని ఒబామాకు లేఖ కూడా రాస్తానని లాయర్ వెల్లడించాడు. ఇంకేముంది.... అమెరికా అధ్యక్షుడి కుమార్తె అంతే ఊరకేనా? మరి ఒబామా ఏమంటారో?