శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (12:30 IST)

ఓటు హక్కు పొందేవరకు శృంగారానికి నిరాకరించాలి.. కెన్యా ఎంపీ మిషీ సంచలన ప్రకటన

కెన్యాలోని మొంబాసా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ మిషీ మోకో సంచలన ప్రకటన చేశారు. దేశంలోని మహిళలంతా తమ భర్తలు ఓటు హక్కు పొందేవరకు శృంగారానికి నిరాకరించాలని పిలుపు నిచ్చారు. ఓటుహక్కు ప్రాధ

కెన్యాలోని మొంబాసా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ మిషీ మోకో సంచలన ప్రకటన చేశారు. దేశంలోని మహిళలంతా తమ భర్తలు ఓటు హక్కు పొందేవరకు శృంగారానికి నిరాకరించాలని పిలుపు నిచ్చారు. ఓటుహక్కు ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఓ మహిళా ఎంపీ ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మహిళలు ఇలా చేస్తేనే ఓటు హక్కును నిర్లక్ష్యం చేస్తున్న పురుషుల్లో మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు. 
 
సుమారు 90 లక్షల మంది అర్హత ఉన్నా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేదని మిషీ మోకో తెలిపారు. ఓటు హక్కుపై మహిళలు చైతన్యవంతమై శృంగారాన్ని ఆయుధంగా మార్చుకోవాలన్నారు. ఓటు నమోదు చేయించుకోకుండా అశ్రద్ధ చేస్తున్న తమ భర్తల్లో మార్పు వచ్చేలా ఆ ఆయుధాన్ని వినియోగించుకోండని ప్రకటించింది. 
 
ఓటరు గుర్తింపు కార్డు చూపించేంతవరకు వారితో శృంగారానికి నిరాకరించండని తెలిపారు. అంతేకాకుండా తన భర్తకు ఆ సమస్య లేదని... ఎందుకంటే ఇప్పటికే ఆయనకు ఓటర్ ఐడీ ఉందని చెప్పి అందరినీ షాక్‌నిచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 8న కెన్యా ఈ ఏడాది పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి.