శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 జులై 2014 (17:00 IST)

భారత్‌లో జాన్‌కెర్రి 3 రోజుల పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాల కోసం..

అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రి భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు ముందు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే కెర్రి ప్రధాన ఉద్దేశం. భారత దేశంతో సంబంధాలను మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రి భారత్ వస్తున్నారు. 
 
యూపీఏ చివరి నాళ్లలో రెండు దేశాల మధ్య సంబంధాలు మందగించాయి. ఇప్పుడు మళ్లీ భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ రెండు దేశాల భాగస్వామ్యం 21వ శతాబ్దంలో తప్పనిసరి అవసరమని కెర్రి వ్యాఖ్యానించారు. ఈ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు.