శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (15:42 IST)

శ్రీశైలం రగడ: ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం!

శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిపై రగడ రాజుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదం చిచ్చు పెట్టింది. తద్వారా ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎదురు దాడి చేశారు.
 
దేవినేని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. దేవినేని ఉమ త్వరలో మాజీ మంత్రి కాబోతున్నారని కౌంటర్ వేశారు. ఆయన తన పదవికి వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
 
చంద్రబాబు నాయుడు జారీ చేసిన జీవోలు సంగతి దేవినేనికి తెలియవని కేటీఆర్ అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తికే నిర్మించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే ఇందుకు సంబంధించిన జీవోలు విడుదల అయ్యాయని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.