Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య డబ్బుతో ప్రియురాళ్ళతో భర్త ఎంజాయ్.. పడక గదిలో ఇద్దరమ్మాయిలతో...

శనివారం, 1 జులై 2017 (08:58 IST)

Widgets Magazine
cheating

కష్టసుఖాల్లో పాలు పంచుకోవాల్సిన భర్త.. తన భార్య సంపాదనతో ఇద్దరమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. కువైట్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
కువైట్‌ నగరంలో ఇద్దరు భార్యాభర్తలు నివశిస్తున్నారు. అయితే, పెళ్లికి ముందు నుంచే ఆ వ్యక్తికి ఇద్దరు ప్రియురాళ్లు ఉన్నారు. వారితో ఎంజాయ్ చేసేందుకు ఓ వినూత్నంగా ఆలోచన చేశాడు. ఖైరాన్ ఏరియాలో సొంతగా ఓ ఫ్లాట్ కొందామని భార్యను నమ్మించాడు. దీంతో భార్య 20 వేల కువైట్ దీనార్లు (సుమారు 45 లక్షల రూపాయలు) ఇచ్చింది. 
 
ఈ డబ్బుతో న్యూగ్రా ప్రాంతంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని తన ప్రియురాళ్లతో రాసలీలలు కొనసాగిస్తూ వచ్చాడు. ఎన్ని సార్లు అడిగినా కొత్త ఫ్లాట్ వద్దకు తీసుకెళ్లకపోవడం, రిపేర్లు చేయిస్తున్నానంటూ చెపుతూ తప్పించుకోసాగాడు. దీంతో భర్త తీరుపై భార్యకు అనుమానం వచ్చింది.
 
ఓ రోజు చెప్పాపెట్టకుండా అనుమానం రాకుండా భర్తను భార్య అనుసరించింది. ఖైరాన్ ప్రాంతం అని చెప్పి న్యూగ్రాకు వెళ్తుండటంతో ఆ అనుమానం మరింత బలపడింది. ఊరిచివరన ఉన్న ఓ ఎస్టేట్‌లో ఫ్లాట్ ముందు భర్త కారు ఆపి లోపలికి వెళ్లడాన్ని చూసింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఫ్లాట్ వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగా, ఓ యువతి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. అంతేలోపలికి దూసుకెళ్లి బెడ్‌రూమ్‌లో ఉన్న భర్తను చూసి అసలేం జరుగుతుందో గ్రహించింది. ఇద్దర్నీ అక్కడే ఉంచి తలుపు తాళం వేసి పోలీసులకు ఫోన్ చేసింది. మొత్తం విషయాన్ని పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పి భర్తపై కేసు నమోదుచేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫ్రెండ్ అని చనువిస్తే.. ఏం చేశాడో తెలుసా?

ఫ్రెండ్ అని చనువిస్తే ప్రియురాలికి కాబోయే భర్తకు అశ్లీల ఫోటోలు పంపించాడు. ఇంతకీ ఈ పాడు ...

news

చరిత్ర పాఠాలు నేర్చుకోవడానికి ఇది 1962 కాదు., చైనా హెచ్చరికపై జైట్లీ ధ్వజం

చరిత్రనుంచి పాఠాలు నేర్చుకోవడానికి ఇది 1962 కాదు 2017 అని గుర్తుంచుకో చైనా అంటూ భారత ...

news

జీఎస్టీపై ఎవరేమన్నారు? జీఎస్టీని వ్యతిరేకిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాపారాలు బంద్

శుక్రవారం అర్థరాత్రి తర్వాత ఆరంభమైన జీఎస్టీకి వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం నుంచి ...

news

గుడ్‌మార్నింగ్‌ ఇండియా... ఒక దేశం ఒకే పన్ను నినాదంతో దేశాన్ని పలుకరించిన జీఎస్టీ..

దాదాపు 17 సంవత్సరాలుగా భారత పన్నుల వ్యవస్థ ఆశించిన కల ఎట్టకేలకు సాకారమైంది. ఒక దేశం ఒకే ...