Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమెరికా బాటలో కువైట్.. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం దేశాలపై నిషేధం

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (08:32 IST)

Widgets Magazine
Indian Passport

అమెరికా బాటలో కువైట్ నడవనుంది. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం మెజారిటీ దేశాలపై కువైట్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశీయులకు వీసాలు జారీ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఐదు దేశాల వలసదారులు, శరణార్థులు తమ దేశం వీసాకు దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది. 
 
అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదులు వలస వస్తారనే కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు కువైట్ ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఏడు ముస్లిం దేశాలపై అమెరికా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. అయితే, సిరియా దేశంపై అమెరికా కంటే ముందుగానే కువైట్ నిషేధం విధించింది. 2011లోనే సిరియా దేశస్తులకు వీసాలు మంజూరు చేయడాన్ని కువైట్ నిలిపివేసిన సంగతి విదితమే. 
 
ఇదిలావుండగా, ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ఏడు ముస్లిం దేశాలపై నిషేధం.. అమెరికన్ ఉద్యోగాలు అమెరిక్లకేనంటూ హెచ్-1బీ వీసాలపై కొరడా ఆ దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతికూలంగా మారబోతున్నాయట. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో మళ్లీ అమెరికా ఎకానమీ కుదేలయ్యే స్థాయికి వెళ్లిపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించడం, ఏడు దేశాలపై నిషేధం విధించడం అమెరికాను సందర్శించే ఇతర దేశాల పర్యాటకులపైన, విద్యార్థులపైన ప్రభావం చూపనుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ ఆదేశాలు కేవలం ఏడు దేశాలకే పరిమితం కావంటున్నారు. వస్తువులు, సర్వీసుల రూపంలో జరిగే గ్లోబల్ ఎక్స్చేంజ్ పాజిటివ్ అంశాలకు ట్రంప్ దెబ్బతీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అమెరికా ఎకానమీకి విదేశీ పర్యాటకులే ఎంతో కీలకమైన మద్దతు అందిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నిషేధాలు, నిరసనలూ సరే.. ఆ ఏడు దేశాల పిల్లల గతేమిటి: ప్రియాంక చోప్రా ప్రశ్న

అమెరికాలోకి ఏడు ముస్లిం దేశాల ప్రజల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఆ దేశాధ్యక్షుడు ...

news

ఉగ్రవాదులు కాదు.. అమెరికన్ ఉన్మాదులే రియల్ డేంజర్.. షాక్ కలిగిస్తున్న అసలు లెక్కలు

అంకెల కన్నా మించి వాస్తవాలను చెప్పే కొలమానం ఈ ప్రపంచంలో మరేమీ ఉండదు కదా. ఏడు ముస్లిం ...

news

ఇన్ఫోసిస్ మూర్తిగారే చెబుతున్నారు. ఇక హెచ్1-బి వీసాలు మర్చిపోవలసిందేనా?

భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు నిజంగానే బహుళ సంస్కృతులకు వీలిచ్చే కంపెనీలుగా ...

news

ఇలాంటి విషయాల్లో అమెరికా, భారత్ ఒకటే మరి. కృతజ్ఞతలు ట్రంప్..!

మొన్నటిదాకా అమెరికా వీధుల నిండా జనం... ఇప్పుడు యూనివర్శిటీల నిండా జనం.. కారణం మాత్రం ...

Widgets Magazine