శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (14:10 IST)

నేపాల్‌లో విరిగిపడిన కొండ చరియలు.. 33 మంది మృతి

భూకంపాలతో దద్దరిల్లిన నేపాల్ కోలుకుంటోంది. ఈ స్థితిలో అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడి 33 మంది ప్రాణాలను కోల్పోయారు. నేపాల్‌లోని కస్కి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ దెబ్బకు కస్కిలోని అనేక గ్రామాలలో నివాసం ఉంటున్న ప్రజలు బయటకు రాలేక వారి గ్రామాలలోనే చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
 
నేపాల్‌లో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలలో కస్కి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ ప్రాంతంలో చాలా ఎత్తులో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. భారీగా కురిసిన వర్షాలకు కొండ చరియలు ఒక్క సారిగా కుప్పకూలిపోయాయి. విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు రంగంలోకి దిగాయి. ఆర్మీ అధికారులకు రెస్య్కూ సిబ్బంది సహకరిస్తున్నారు. 
 
ఆ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ఇప్పటి వరకు 33 మంది మృతి చెందారు. వారిలో 31 మంది గల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడి 27 ఇండ్లు నేలమట్టం అయ్యాయి. బ్రిడ్జిలు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని అధికారులు వెల్లడించారు.