శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (10:55 IST)

ఉగ్ర శిబిరాలపై భారత సైనికుల దాడి.. భారత ఆర్మీ వీడియో తీసిందట.. త్వరలో విడుదల?

భారతదేశంలో పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం దాడులు చేసింది. పాకిస్థాన్ భూభాగంలోకి మూడు కిలోమీటర్ల మేర చొరబడింది. అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై సునిశిత దాడులు చేసి 37

భారతదేశంలో పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం దాడులు చేసింది. పాకిస్థాన్ భూభాగంలోకి మూడు కిలోమీటర్ల మేర చొరబడింది. అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై సునిశిత దాడులు చేసి 37 మంది టెర్రరిస్టులను హతమార్చింది. ఈ చర్యపై ఓవైపు కేంద్రంలోని మోడీ సర్కారు ప్రముఖ రాజకీయ నేతలు మద్దతు ప్రకటిస్తూనే. మరోవైపు భారత సైన్యానికి జోహార్లు అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. 
 
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూకల శిబిరాలపై దాదాపు 70 మంది భారత ఆర్మీ సైనికులు బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మెరుపుదాడి చేశారు. ఏడు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారం రోజులుగా నిఘా పెట్టి దాడులు చేశారు. ఈ సైనిక ఆపరేషన్‌ను వీడియోలోనూ చిత్రీకరించారు. ఉగ్ర శిబిరాలపై భారత దాడి బూటకంగా పాకిస్థాన్ చెబుతున్న నేపథ్యంలో ఈ వీడియో ఆధారాలను విశ్లేషిస్తున్న భారత ఆర్మీ త్వరలో ఆ వీడియోను కూడా బయటపెట్టనున్నట్లు ప్రకటించింది. 
 
ఇదిలా ఉంటే.. ఉగ్రవాదాన్ని అంతమొందించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌కు తాము అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు సోనియాగాంధీ వెల్లడించారు. సైనికుల దాడుల ద్వారా పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇచ్చినట్లైందని చెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల బాధ్యత పాకిస్థాన్ దేనని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, తమ దేశంలో ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించడానికి పాకిస్థాన్ ఇకనైనా చరమగీతం పాడాలని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.