Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మాల్దీవుల్లో ఎమర్జెన్సీ : సుప్రీం న్యాయమూర్తుల అరెస్టు

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (12:50 IST)

Widgets Magazine
Maldives police

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆ దేశ సుప్రీంకోర్టుకు చెందిన న్యాయమూర్తులు జస్టిస్ అబ్దుల్లా సయీద్, అలీ హమీద్‌లను సైన్యం అరెస్టు చేసింది. 12 మంది విపక్ష ఎంపీలపై అనర్హత పేరుతో వేసిన వేటు చెల్లదని, జైల్లో ఉన్న వారందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ తోసిపుచ్చి సోమవారం రాత్రి ఎమర్జెన్సీ ప్రకటించి, ఈ అత్యయికస్థితి 15 రోజుల పాటు కొనసాగుతుందని ఆదేశాలు జారీచేశారు. 
 
ఫలితంగా మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం ముదిరిపాకాన పడినట్టయింది. విపక్ష సభ్యులకు అనుకూలంగా తీర్పునిచ్చిన న్యాయమూర్తులను అరెస్టు చేయించారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తి పరిస్థితి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు దేశంలో 15 రోజులపాటు అత్యవసర స్థితిని విధిస్తున్నట్టు రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. 
 
ముఖ్యంగా, ప్రతిపక్ష నేతలను విడుదల చేయాలంటూ సుప్రీం ఆదేశించిన తర్వాత మాజీ అధ్యక్షుడు నషీద్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దీంతో రాజధాని మాలిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కోర్టు ఆదేశాలను పాటిస్తామన్న పోలీస్ చీఫ్‌ అహ్మద్ అరిఫ్‌ను ప్రభుత్వం తొలగించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భర్త నుంచి కాపాడాలంటూ భార్య అరణ్య రోదన (వీడియో)

ముంబైకు చెందిన ఓ మహిళ తన భర్త నుంచి కాపాడాలంటూ ట్విట్టర్‌లో వీడియో ద్వారా పోలీసులకు ...

news

భువనగిరిలో హాట్ కాలింగ్ : బూతు మాటలు మాట్లాడటమే ఉద్యోగం

తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరిలో హాట్ కాలింగ్ గుట్టురట్టయింది. ఉద్యోగం పేరుతో అందమైన ...

news

ఉత్తరప్రదేశ్‌లో 40 మందికి హెచ్ఐవీ.. కారణమిదే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. ఏకంగా 40 మందికి హెచ్ఐవీ సోకింది. దీనికి కారణం ...

news

చంద్రగ్రహణ నరబలి : భార్య ఆరోగ్యం కోసం చిన్నారిని బలిచ్చాడు

ఇటీవల సంపూర్ణ చంద్రగ్రహణం రోజున హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన నరబలి కేసులోని మిస్టరీ ...

Widgets Magazine