శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2016 (21:28 IST)

ఆప్‌స్కర్ట్ అమ్మాయి.. వృద్ధ కామాంధుడు చేసిన నీచమైన పని...

'కామాతురాణాం న భయం న లజ్జ' అన్నారు మన పెద్దలు. కామంతో కళ్ళు మూసుకుపోయిన మృగాళ్ళు చేసే పనులు సభ్య సమాజం తలదించుకునేలా ఉంటుంది. ఇలాంటి మృగాళ్లు వయసుతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు.

'కామాతురాణాం న భయం న లజ్జ'  అన్నారు మన పెద్దలు. కామంతో కళ్ళు మూసుకుపోయిన మృగాళ్ళు చేసే పనులు సభ్య సమాజం తలదించుకునేలా ఉంటుంది. ఇలాంటి మృగాళ్లు వయసుతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. వీరికి చుట్టుపక్కల వారు ఏం అనుకుంటారనే భయం ఉండుదు. సిగ్గు అంతకంటే ఉండదు. అందుకే వాళ్లు చేసే పనులతో పాటు ఆలోచనలు కూడా నీచంగానే ఉంటాయి. దీనికి రష్యాలో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనే నిదర్శనం. 
 
రష్యాలోని చెల్యబిన్స్క్ నగరంలోని ఓ సూపర్ మార్కెట్‌లో వయసు మీరిన కామాంధుడు చేసిన పని అందరికీ అసహ్యం తెప్పిస్తోంది. ఓ వృద్ధుడు సూపర్ మార్కెట్‌లో వస్తువులను కొనుగోలు చేసేందుకు పరిశీలిస్తున్నట్టుగా నటించాడు. అతని పక్క నుంచి వెళ్ళే అమ్మాయి అప్‌స్కర్ట్‌ ధరించి ఉండగా, కింది భాగంలో సెల్‌ఫోన్ పెట్టి చిత్రీకరించాడు. ఆ అమ్మాయి ఆ సంఘటన తర్వాత ఆ వృద్ధుడివైపు అనుమానంగా చూసినా, మళ్ళీ షాపింగ్‌లో నిమగ్నమైపోయింది. 
 
ఈ కామాంధుడి వికారపు చేష్టలను ఓ సెక్యూరిటీ గార్డు పరిశీలించాడు. సీసీటీవీ ఫుటేజీని బహిర్గతం చేసి పది మందిలో అవమానించడమేకాకుండా, సీసీటీవీ ఫుటేజ్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇది వైరల్‌లా వ్యాపించింది. ఆ వీడియో మీరు కూడా చూడండి.