గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 27 జులై 2014 (17:26 IST)

న్యూయార్క్‌లో స్పైడర్ మ్యాన్ వేషధారి అరెస్టు!

న్యూయార్క్ మహానగరంలో స్పైడర్ మ్యాన్ వేషంలో ఓ మహిళా యాత్రికురాలిని వేధిస్తున్న వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఆ టూరిస్టును డబ్బులివ్వాలంటూ స్పైడర్ మ్యాన్ వేషధారి వెంటపడ్డాడు. ఆమె ఒక డాలర్ ఇవ్వగా అతడు నిరాకరించాడు. 20 డాలర్లు ఇవ్వాలని, లేదా, 10 డాలర్లైనా ఇవ్వాలని, చివరికి కనీసం 5 డాలర్లైనా ఇవ్వాలని ప్రాధేయపడుతూ వెంటపడ్డాడు. 
 
దీన్ని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు.. సదరు వేషగాడిని అడ్డుకున్నారు. దీంతో, స్పైడర్ మ్యాన్‌కు కోపం వచ్చింది. వెంటనే ఆ పోలీసు ముఖంపై గుద్దాడు. ఈ ఘటనపై సమాచారమందుకున్న ఇతర పోలీసు అధికారులు అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అతడిని జూనియర్ బిషప్‌గా గుర్తించారు. అరెస్టును నిరోధించడం, పోలీసు అధికారిపై దాడి చేయడం, దుష్ప్రవర్తన వంటి అభియోగాలను బిషప్‌పై న్యూయార్క్ పోలీసులు కేసులు నమోదు చేశారు.