గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2016 (11:14 IST)

కుక్కను రక్షించేందుకు అద్దాల్ని పగలకొట్టాడు.. రియల్ హీరో అయ్యాడు

కుక్కని రక్షించడానికి కారు అద్దాల్ని పగల కొట్టి ఓ వ్యక్తి రియల్ హీరో అయ్యాడు. ఈ ఘటన కెనడాలో ఒంటారియోలోని గ్రాండ్ బెండ్‌‌లో జరిగింది. కారులో ఉండిపోయిన కుక్కను బయటికి తీసి ప్రాణాలు కాపాడి మూగజీవుల పట్ల

కుక్కని రక్షించడానికి కారు అద్దాల్ని పగల కొట్టి ఓ వ్యక్తి రియల్ హీరో అయ్యాడు. ఈ ఘటన కెనడాలో ఒంటారియోలోని గ్రాండ్ బెండ్‌‌లో జరిగింది. కారులో ఉండిపోయిన కుక్కను బయటికి తీసి ప్రాణాలు కాపాడి మూగజీవుల పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... గ్రాండ్ బెండ్‌లో జరుగుతున్న ఓ ఫెస్ట్కు చాలామంది వచ్చారు. అక్కడికి వచ్చిన ఇద్దరు దంపతులు తమ కుక్కను కూడా వెంటబెట్టుకుని కారులో వచ్చారు. అయితే దానిని ఆ కారులోనే వదిలేసి వాళ్లు మాత్రం లోపలికివెళ్లారు. 
 
లాక్ చేసి ఉన్న కారులోనే ఆ కుక్క చాలా సమయం నుంచి ఉంది. అక్కడ ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండటంతో అప్పటికే ఆ కుక్క తీవ్ర అస్వస్థతకు గురైంది. దీనస్థితిలో ఉన్న దాని పరిస్థితిని చూడలేని ఓ వ్యక్తి... యజమానులు రావల్సిందిగా ముందుగా ఓ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఎంతసేపటికి ఎవరూ రాకపోవడంతో... ఆ కుక్కని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించిన ఆ మనసున్న మనిషి... అక్కడే ఉన్న బండరాయి సాయంతో కారు అద్దం పగులగొట్టి కుక్కను బయటకు తీశాడు. కారు అద్దాలు పగుల గొట్టిన మరో గంట వరకు కూడా అక్కడికి కారు యజమానులు రాలేదు. ఒక వేళ ఆ వ్యక్తి అలా చేసి ఉండకపోతే ''కుక్క పరిస్థితి చాలా దారుణంగా ఉండేది'' అని ప్రత్యక్ష సాక్షి విల్ కోస్టా తెలిపారు. 
 
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుక్క యజామానులను స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాటసారి కారు అద్దం పగులగొడుతున్న దృశ్యాన్ని అక్కడే ఉన్న వారు వీడియో తీసి పోస్ట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతటి సాహసం చేసిన ఆ వ్యక్తిని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచవ్యాప్తంగా యజమానుల నిర్లక్ష్య ధోరణితో ఎన్నో పెంపుడు శునకాలు కార్లలోనే వదిలి వెళ్లడంతో వేడిమికి, ఊపిరాడక బలవుతున్నాయి. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.