గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (17:34 IST)

భార్యకు మస్కా ఇచ్చి.. ఇద్దరు భామలతో... 20 ఏళ్లు కాపురం, అరెస్ట్!

ఒకరికి తెలియకుండా మరొకరితో ఇలా ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం నడుపుతూ వచ్చిన ఓ వ్యక్తిని చైనా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విధంగా ఏకంగా అతను 20 యేళ్ల పాటు ముగ్గురు భామలతో సంసార జీవితం గడపడం గమనార్హం. తాజాగా వెల్లడైన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... చైనాలోని గువాంగ్ డాంగ్ అనే ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల చెన్‌ను తొలుత 1992లో తొలి వివాహం చేసుకున్నాడు. తొలి భార్యకు తెలియకుండా 1994లో మరో మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. వారిద్దరికీ తెలియకుండా 2007లో మరో మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. 
 
దీంతో తన భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి కూపీ లాగడంతో అసలు విషయం వెలుగుచూసింది. అయితే, తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని ఉంటే ఆయనను క్షమిస్తూ, తనకు విడాకులు మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ నేరం రుజువైతే డాంగ్‌ రెండేళ్ల శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే చైనాలో బహుభార్యత్వానికి రెండేళ్ళ జైలు శిక్ష విధించాలన్న చట్టం అమలులో ఉంది.