Widgets Magazine

చెల్లెల్లాంటిదానివి అన్నాడు.. కెమెరాలో మొత్తం తీసేశాడు.. రెండ్రోజుల్లో 50 లక్షలమంది చూసేశారు

హైదరాబాద్, శుక్రవారం, 19 మే 2017 (05:23 IST)

Widgets Magazine
hidden camera

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదని అనుకున్నట్లు.. ఆ వ్యక్తి రైల్లో తన ఎదురు సీట్లో ఉన్న మహిళను ఫోన్లో వీడియో తీస్తూ.. ఎవరికీ తెలియలేదని అనుకున్నాడు. రైలు మొత్తం ఖాళీగా ఉన్నా, అతడు సరిగ్గా ఆమెకు ఎదురుగా ఉన్న సీట్లోనే కూర్చున్నాడు. తన దగ్గర ఉన్న ఐఫోన్ బయటకు తీసి, దాంట్లో ఏదో చూస్తున్నట్లుగా సీరియస్‌గా స్క్రీన్ వైపు చూస్తూ చాలాసేపు అలాగే ఉన్నాడు.  మెట్రో రైల్లో వెళ్తుండగా వెధవ్వేషాలు వేస్తున్న వ్యక్తిని ఓ మహిళ రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకున్నారు.  
 
అతడు ఫోన్ పట్టుకున్న తీరు అనుమానాస్పదంగా కనిపించింది. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే, అతడి వెనకాల ఉన్న కిటికీ అద్దం మీద ఆ ఫోన్‌లో ఏం చేస్తున్నదీ స్పష్టంగా కనిపించింది. అతడు తననే వీడియో తీస్తున్నట్లు ఆమె గుర్తించింది. ఏమీ ఎరగనట్లుగా తాను కూడా ఫోన్ తీసి అతగాడిని షూట్ చేయడం మొదలుపెట్టారు. అతడు తొలుత మామలూగా చూస్తూనే, కాసేపు ఆగి ఫోన్‌ను మరింత జూమ్ చేసి ఆమెను బాగా క్లోజప్‌లో షూట్ చేయసాగాడు. అదంతా వెనకాల కిటికీ అద్దం మీద కనిపిస్తూనే ఉంది.
 
విషయం తెలిసిన సదరు మహిళ ఉమామహేశ్వరి.. తాను తీసిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోను కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 50 లక్షల మంది చూశారు. శనివారం జరిగిన ఈ ఘటన విషయాన్ని ఆమె ఆదివారం నాడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు, వీడియో తీసిన తర్వాత.. నువ్వు చేస్తున్న పనేంటి అంటూ అతడితో గొడవపడి, స్టేషన్ వచ్చిన తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. అతడివద్ద ఇలాంటివే చాలా వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు తమ విచారణలో గుర్తించారు. 
 
గుర్తుతెలియని మహిళలను అత్యంత అసభ్యకరమైన రీతిలో అతడు వీడియో తీశాడని ఆమె తన పోస్టులో రాశారు. తాను గుర్తుపట్టిన తర్వాత కూడా క్షమాపణలు చెప్పడానికి బదులు రకరకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చాడని ఉమా మహేశ్వరి చెప్పారు. తనను అతడు చెల్లెలి లాంటిదని కూడా చెప్పాడని, అలా అయితే ఎందుకు వీడియో తీశాడని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలనే తాను అందరి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నట్లు ఆమె చెప్పారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాక్‌పై భారత్‌కు అతి గొప్ప దౌత్య విజయం.. దేశంలో సంబరాలు

చాలా కాలం తర్వాత భారతదేశం తన దాయాది పాకిస్తాన్‌పై అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద దౌత్య ...

news

నందమూరి మోక్షజ్ఞపై మోజుతో నిశిత్ కారు ప్రమాదమా??

కొత్త వార్త... ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి ...

news

రజినీ పార్టీ పేరు ధర్మచక్రం? గుర్తు విష్ణుచక్రం? పవన్ 'చక్రం'తో పదనిసలా...?

దేవుడు ఆదేశించాడేమో..తలైవా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. జయలలిత మరణం ...

news

డ్రగ్స్ మత్తు వీడిన ప్రముఖ హీరో... ప్రభుత్వంతో చర్చల్లో బిజీ బిజీ

ఇటీవల జరిగిన అభిమానుల సమావేశంలో ప్రసంగాన్ని ముగిస్తూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ...