శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 మే 2016 (13:16 IST)

కారు డ్రైవర్‌కు వాటాలిచ్చిన నల్లసూరీడు.. ఆస్తిలో వాటా ఇవ్వడమంటే మాటలు కాదు!!

దక్షిణాఫ్రికా నల్ల సూరీడు నెల్సన్ మండేలా ఆస్తిలో తన కుటుంబ సభ్యులకే కాకుండా తాను చదివిన పాఠశాల, విశ్వవిద్యాలయం, తన కారు డ్రైవర్ వంటివారికి కూడా వాటాలిచ్చారు. నల్లసూరీడుతో తనకుగల 23 ఏళ్ల అనుబంధం గుర్తుకొస్తోందని.. ఆయన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసిన మైక్ మపొన్యా (68) విచారానికి లోనయ్యారు. తన వాటాను కూడా తీవ్ర విచారానికి లోనవుతూ తీసుకున్నారు. 
 
మండేలా కింద పనిచేసిన తనలాంటి వారికి ఆస్తిలో వాటా ఇవ్వడమంటే మాటలు కాదని మపొన్యా అన్నారు. నెల్సన్ మండేలా మహోన్నత వ్యక్తిత్వం ఉన్న మనిషి అని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు కారు డ్రైవర్ మైక్ మపొన్యా 50 వేల ర్యాండ్‌ల (రూ.2,13,863) చెక్కును అందుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. చాలాబాధగా ఉన్నా సంతోషిస్తున్నానని.. మండేలా హృదయానికి, దాతృత్వానికి ఇది నిదర్శనమన్నారు.