శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (11:50 IST)

అంగారకుడిపై దూళి: కెమెరాలో బంధించి భూమికి పంపిన మామ్

అంగార గ్రహంపైకి అడుగిడిన మామ్ (మాస్ ఆర్బిటర్ మిషన్) మామూలుగా పనిచేయడంలేదు... ఎంతో సమర్థవంతంగా, నిక్కచ్చిగా తన విధులను నిర్వహిస్తోంది. అరుణ గ్రహంపై వాతావరణం ఎలా ఉందో తేటతెల్లం చేసే ఓ ఫోటోలను పంపుతూనే ఉంది. అక్కడి వాతావరణ పరిస్థితి అద్దం పట్టే ఫొటోలను భూమికి చేరవేసింది. తాజాగా అక్కడ చెలరేగిన దుమ్ము తుఫానును తన కెమెరాలో బంధించి.. భూమికి చేరవేసింది. 
 
అరుణ గ్రహం ఉత్తరార్ధ గోళంలో ఈ తుపాను ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కాగా అరుణ గ్రహం అంతా బంగారుమయం అనే వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో అంగారకుడిపై మీథేన్ జాడలను, ఖనిజాల లభ్యతను మామ్ వెతికే పనిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. కాగా జీవి బతికేందుకు అనువైన వాయువు మీథేన్ అన్న సంగతి తెలిసిన విషయమే.