గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 15 మార్చి 2017 (06:32 IST)

మనం నీళ్లు లేక చస్తాం. అమెరికాలో మంచుకురిసి చస్తారు.. 7,600 విమానాలు రద్దు

అమెరికా తూర్పు తీరం చిగురుటాకులా వణికిపోతున్నది. మంచు తుఫాన్‌ తీవ్రమవడంతో మూడు కోట్ల మంది అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే 7,600 విమానాలు రద్దయ్యాయి. వేలాది స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్త

అమెరికా తూర్పు తీరం చిగురుటాకులా వణికిపోతున్నది. మంచు తుఫాన్‌ తీవ్రమవడంతో మూడు కోట్ల మంది అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే 7,600 విమానాలు రద్దయ్యాయి. వేలాది స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వీక్షణస్థాయి సున్నా పడిపోనుండటంతో అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. 
 
అమెరికాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ మంచు తుఫాన్‌ కారణంగా ప్రభావితమవుతున్నట్లు సీఎన్‌ఎన్‌ చానెల్‌ వెల్లడించింది. న్యూయార్క్, బోస్టన్‌లాంటి ప్రధాన నగరాలను మంచు దుప్పటి కప్పేస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు అడుగుల మేర భారీగా మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు మంగళవారం వాతావరణ నివేదికలు తెలిపాయి.
 
ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలోని అన్ని విమానాలను రద్దు చేశారు. న్యూయార్క్‌ నగరంలో 20 అంగుళాల మేర మంచు కురవనున్నట్లు అంచనా వేస్తున్నారు. న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కూమో అత్యవసర చర్యలకు ఆదేశించారు. ఇప్పటికే భారీగా బలగాలను నగరంలో మోహరించారు. ఫిలడెల్ఫియాలో 10 అంగుళాలు, మసూచుసెట్స్‌లో 24 అంగుళాల మేర మంచు కురవనుంది. 
 
మంగళవారం ఉదయం నుంచి కనెక్టికట్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణాలపై నిషేధం విధించారు. అటు వర్జీనియాలో పోర్ట్‌ ఆఫ్‌ వర్జీనియాను కోస్ట్‌ గార్డ్‌ మూసివేసింది. తూర్పు తీరంలో ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే మంచు తుఫాన్‌ కారణంగా విస్కాన్సిన్‌లో ఇద్దరు చనిపోయారు.