గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (11:54 IST)

సోదరితో సహా మిస్ హోండురస్ సుందరి హత్య!

సెంట్రల్ అమెరికాలోని హోండురస్ దేశానికి చెందిన సుందరి మారియా జోస్ అల్వరాడో (19), ఆమె అక్క సోఫియాలు హత్యకు గురయ్యారు. గత గురువారం లేట్‌నైట్ పార్టీ నుంచి అదృశ్యమైన వారిద్దరి మృత దేహాలు అగ్వాగ్వా నది సమీపంలో ఉన్న కాబ్లోటెల్స్ గ్రామం దొరికాయి. 
 
అల్వరాడో త్వరలో లండన్‌లో జరుగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ స్థితిలో ఆమె మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. అక్కాచెల్లెళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 
 
అంతేకాకుండా అల్వరాడో అక్క సోఫియా ప్రియుడు అంటోనియో రూయిస్ ఇద్దరి తుపాకీతో కాల్చి చెంపినట్టు పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది. దీంతో పోలీసులు అతనితోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.