బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (16:39 IST)

ఆమెకి ఎయిడ్స్ వుంది... కానీ మిస్ బ్యూటీ క్వీన్ అయింది... ఎలా?

ఎయిడ్స్ వ్యాధి అనగానే ఇక మరణం కోసం ఎదురుచూడటమే అనుకుంటారు. కానీ ఆమె అత్యంత ధైర్యంతో దాన్ని ఎదుర్కొంది. అంతేకాదు... ఏకంగా మిస్ కాంగో యూకె కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె పేరు హోర్సెలీ సిండా. ఆమె వయసు 22 ఏళ్లు. తనకు మిస్ కాంగో యూకె 2017 కిరీటం రావడంపై ఆమె

ఎయిడ్స్ వ్యాధి అనగానే ఇక మరణం కోసం ఎదురుచూడటమే అనుకుంటారు. కానీ ఆమె అత్యంత ధైర్యంతో దాన్ని ఎదుర్కొంది. అంతేకాదు... ఏకంగా మిస్ కాంగో యూకె కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె పేరు హోర్సెలీ సిండా. ఆమె వయసు 22 ఏళ్లు. తనకు మిస్ కాంగో యూకె 2017 కిరీటం రావడంపై ఆమె ఎంతో ఉద్వేగానికి గురైంది. 
 
తన వ్యాధి గురించి చెపుతూ... నేను కాంగోలో పుట్టాను. కానీ నాకు ఎయిడ్స్ వున్నదన్న సంగతి యూకేకి వచ్చిన తర్వాత తెలిసింది. ఐతే అది కూడా నాకు 11 ఏళ్లు వయస్సున్నప్పుడు వ్యాధి వున్నట్లు తేలింది. ఐతే చాలామందిలానే నేను కూడా వ్యాధిని అరికట్టేందుకు మందూమాకూ వాడలేదు. కానీ ఎందుకో ఎయిడ్స్ వైరస్ నా శరీరంపై దాడి చేసి నాశనం చేయలేదు. బహుశా ఇందుకేనేమో నాపై కరుణ చూపించిందంటూ ఆమె చెప్పుకొచ్చింది.
 
ఐక్యరాజ్యసమిత లెక్కల ప్రకారం రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో సుమారుగా 3,70,000 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులుగా వున్నట్లు తేలింది. వీరిలో 14 ఏళ్ల లోపువారు 11 శాతం వున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. దీనిపై మిస్ కాంగో యూకె మాట్లాడుతూ... తనకు వచ్చిన ఎయిడ్స్ వ్యాధికి ఎవరినో నిందిస్తూ కాలం వెళ్లబుచ్చలేనని తెలిపింది. ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతంగా వుండలేరని తెలుసు. 
 
అలా శాశ్వతం కాని దానికోసం ఎవరినో నిందిస్తూ కాలం వృధా చేయడం అనవసరం. అంతా ఆరోగ్యంగా వున్నవారు కూడా విధి వక్రీకరించి తెల్లారేసరికి విగతజీవులుగా మారుతున్నారు. మరి దీనికి కారణం ఏమిటి? కాబట్టి మనకు లభించిన జీవితంలో సంతోషంగా ముందుకు సాగడం తప్పించి జీవితంలో ఎవరినో నిందించుకుంటూ వుండటం అనవసరం. ఈ కాలాన్ని ఏదో ఒకటి సాధించాలన్నదానిపై దృష్టి కేంద్రీకరిస్తే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పిందామె.