బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2016 (17:25 IST)

నిరసన జ్వాలలు ఉత్తుత్తివే.. అంతా ఓ తమాషా : డోనాల్డ్ ట్రంప్

తనకు ఎన్నికల ప్రచారంలో ఎదురవుతున్న నిరసనలపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తనదైశైలిలో స్పందించారు. ఇదే అంశంపై ఆయన ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ తాను అమెరికా అధ్యక్షుడినైతే అమలు చేసే విధానాల గురించే తాను ప్రస్తావిస్తున్నానని చెప్పారు. అవి నచ్చనివారే తన ప్రచార సభల ముందు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. పైగా ఇది ఓ తమాషా చర్యగా ఆయన అభివర్ణించారు. 
 
అందువల్ల వీటిని ఏమాత్రం పట్టించుకోవాల్సిందేమీ లేదన్నారు. అదేసమయంలో జీఓపీ ప్రైమరీల్లో రికార్డు స్థాయిలో విజయం సాధిస్తున్నానని ధీమాగా చెప్పారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరుగుతున్న తొలిదశ ప్రైమరీ ఎన్నికలు ఆసక్తిగా జరుగుతున్న విషయంతెల్సిందే. ఇందులోభాగంగా, కాలిఫోర్నియాలో రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ జూన్ 7వ తేదీ జరుగుతుంది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ 'నేనెప్పుడూ ఇంత కష్టంగా వెళ్ళలేదు. సరిహద్దులు దాటుతున్నట్లు అనిపించింది' అన్నారు. ప్రసంగాన్ని మానుకుంటే మంచిదని తనకు చెప్పారని, అయితే ప్రజలను నిరాశపరచలేనని చెప్పారు. అంతా తమాషాగా జరిగిందన్నారు. కాస్త కొత్తగా ఉందన్నారు. మురికి, బురద, కంచెలను దాటుకుంటూ సమావేశానికి వచ్చినట్లు, తిరిగి వెళ్ళేటపుడు కూడా అలాగే వెళ్ళాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.