గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PYR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (16:25 IST)

నేనో కుక్ మనవడిని... మోదీ ఓ చాయ్ వాలా కొడుకు.. మాది ఒకే నేపథ్యం.. ఒబామా

’ఆయన (మోదీ) ఓ చాయ్ వాలా కొడుకు... నేనూ ఓ కుక్ మనవడిని... మా ఇద్దరిది ఒకే నేపథ్యం... ఒకప్పుడు నా రంగు చూసి వివక్ష చూపారు‘ ఇలా మాట్లాడింది ఎవరో తెలుసా.. ఒబామా... బరాక్ ఒబామా... ఆయనే అమెరికా అధ్యక్షుడు  ఒకప్పుడు ఓ సామాన్య మనిషి.. కాని ఇప్పుడో ప్రపంచంలోనే తిరుగులేని పెద్ద దేశానికి అధ్యక్షుడు. ఆయన అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎక్కడ మాట్లాడాడు.?
 
ఢిల్లీ సిరిఫోర్ట్ ఆడిటోరియంలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా చేసిన ప్రసంగంలో ఓ ఆదర్శం కనిపిస్తుంది. ఓ కసి వినిపిస్తుంది... ఓ పట్టుదల ఫరిడవిల్లింది.. ఆయన మాటలను ఎంత మంది కసిగా తీసుకుంటారో తెలియదుగానీ, అవి నిజంగా ఆణిముత్యాలే. భారత్‌లోని యువశక్తిని, వారికి గల అవకాశాలను, సాధించగలిగిన విజయాలను ఆయన తన ప్రసంగంలో మన ముందు ఉంచారు. 
 
తానేంటో చెప్పారు... అసలు మన దేశ ప్రధాని మోదీ ఏంటో వివరించారు. భారత ప్రధాని మోదీ, తానూ ఒకే నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చినవాళ్లమేననీ, కాకపోతే తానో  కుక్  మనవడిననీ, నరేంద్ర మోదీ టీ అమ్ముకునే వ్యక్తి కొడుకని వ్యాఖ్యానించారు. ఒక్కోసారి నా శరీరపు రంగు చూసి నా పట్ల వివక్ష చూపారు. మనమంతా భగవంతుని పిల్లలం..ఆయన దృష్టిలో అందరం సమానులం.  అవకాశాలను అందిపుచ్చుకోవాలని కళ్ళ ముందు ఉన్న తనను, ప్రధాని మోదీనే ఉదాహరణగా... చాలా కాజువల్ గా చెప్పారు. 
 
అంతే కాదు అతను ఎంత మంచి భర్తో.. ఎంత మంచి తండ్రో అతని మాటల్లోనే తెలుస్తుంది. ‘నా భార్య చాలా ప్రతిభ గలది..నేను తప్పు చేసినప్పుడు దానిని వేలెత్తి చూపడానికి ఆమె వెనుకాడదు..మాకు ఇద్దరు అందమైన కూతుళ్ళు’ అని తన వ్యక్తిగత విషయాలను కూడా ఆయన తెలియజేశారు.