శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (20:20 IST)

విదేశీ ఉద్యోగుల మెడపై కత్తి - తొలగించేందుకు కారణాలు వెతుకుతున్న యుఎస్ కంపెనీలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతో అమెరికా కంపెనీలు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాయి. తమ వద్ద ఉన్న విదేశీ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. ఇందుకోసం కారణాలు వెతికే పనిలో నిమగ్నమై, వ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతో అమెరికా కంపెనీలు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాయి. తమ వద్ద ఉన్న విదేశీ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. ఇందుకోసం కారణాలు వెతికే పనిలో నిమగ్నమై, విదేశీ ఉద్యోగుల మెడపై కత్తిని వేలాడదీశాయి. అంతేకాకుండా, విదేశీయులను నియమించుకున్నందుకు ప్రభుత్వానికి సవాలక్ష వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఆ కంపెనీలకు ఏర్పడ్డాయి. 
 
ట్రంప్‌ చేపట్టిన చర్యల్లో భాగంగా అమెరికాలోని కంపెనీల్లో నియామకాలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. విదేశీయులకు హెచ్-1బీ వీసాలు ఇచ్చేందుకు కంపెనీలు ససేమిరా అంటున్నాయి. అంతేకాకుండా, తన వ్యక్తిగత కారణమే కాకుండా, వివిధ కారణాలతో ఒక కంపెనీ నుంచి బయటికొచ్చిన ఉద్యోగికి ఇపుడున్న పరిస్థితుల్లో మరో కంపెనీలో ఉద్యోగం దొరకడం గగనంగా మారింది. 
 
ముఖ్యంగా ట్రంప్ ఆదేశాలను పాటించేందుకు అన్ని కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. దీంతో విదేశీయులను ఉద్యోగంలోకి తీసుకుని ప్రభుత్వంతో ఎందుకు విరోధం పెంచుకోవాలనే భావనతో కంపెనీ యాజమాన్యాలు ఉన్నాయి. మరోవైపు, విదేశాల్లో కంపెనీలు పెట్టి అక్కడి నుంచి ప్రాజెక్టులు చేపట్టడాన్ని నిలిపివేయాలని కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దాంతో, పలు కంపెనీలు తమ ప్రాజెక్టులను వదిలేసుకుంటున్నాయి.