శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (18:12 IST)

ముంబై ముష్కరుడు లఖ్వీకి పాక్ కోర్టు బెయిలిచ్చింది..!

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం ముంబై ముష్కరుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి బెయిల్ ఇచ్చింది. ఆరేళ్ళ క్రితం ముంబైలో పేలుళ్ళు జరిపి 166 మంది మృతికి కారణమైన ఉగ్రవాది జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఒకపక్క పెషావర్‌లో 141 మంది స్కూలు పిల్లలను తాలిబన్ ఉగ్రవాదుల చేతిలో కోల్పోయిన పాకిస్థాన్, ఒకపక్క లబోదిబో అంటూనే మరోపక్క ఈ ఉగ్రవాదికి బెయిల్ మంజూరు చేసింది. 
 
లఖ్వీ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండి జైల్లో వున్నాడు. లఖ్వీకి పాకిస్థాన్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల భారతదేశం తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే లఖ్వీకి బెయిల్ వచ్చిందని భారతదేశం ఆరోపిస్తోంది.