శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2016 (12:52 IST)

రంజాన్ మాసమని గడ్డం పెంచుకున్నాడు.. పోలీస్ నిబంధనలకు విరుద్ధమని తొలగించారు ఎక్కడ?

గడ్డం పెంచుకుంటే తప్పా..? గడ్డం పెంచుతున్నాడనే కారణంలో ఓ ఆఫీసరును విధుల నుంచి తొలగించారు. న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి మసూద్ సయ్యద్.

గడ్డం పెంచుకుంటే తప్పా..? గడ్డం పెంచుతున్నాడనే కారణంలో ఓ ఆఫీసరును విధుల నుంచి తొలగించారు. న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి మసూద్ సయ్యద్. అయితే ఆయన పోలీసు శాఖ నిబంధనలకు విరుద్ధంగా గడ్డం పెంచుతున్నాడన్న కారణంతో విధుల నుంచి తొలగించారు. పోలీస్‌ శాఖ నిబంధనల్ని తనపై చర్యల్ని సవాల్‌ చేస్తూ... మన్‌హట్టన్‌లోని ఫెడరల్‌ కోర్టును మసూద్‌ సయ్యద్‌ ఆశ్రయించారు.
 
మసూద్‌ సయ్యద్‌ను తిరిగి విధుల్లో తీసుకోవాలని బుధవారం నాడు కోర్టు తీర్పు వెలువరించింది. 32 ఏళ్ల మసూద్ సయ్యద్ ముస్లిం పోలీసాఫీసర్. రంజాన్ నెల కావడంతో షేవ్ చేసుకోకపోవడంతో అతనిని విధుల నుంచి తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్ల పాటు నిజాయితీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన్ని గడ్డం తీయలేదనే కారణంతో తొలగించడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.