బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (20:13 IST)

మయన్మార్ అధ్యక్షుడిపై సోషల్ మీడియాలో కామెంట్.. వ్యక్తికి 9నెలల జైలు

మయన్మార్ అధ్యక్షుడు టిన్ క్వాను ఉద్దేశించి ఆంగ్ విన్ హ్లెయింగ్ అనే వ్యక్తి 'క్రేజీ'అని తన ఫేస్ బుక్ పేజీతో పోస్ట్ చేశాడు. అదే ప్రస్తుతం అతనికి తొమ్మిది నెలల జైలుశిక్ష అనుభవించేలా చేసింది. సోషల్ మీడియా

మయన్మార్ అధ్యక్షుడు టిన్ క్వాను ఉద్దేశించి ఆంగ్ విన్ హ్లెయింగ్ అనే వ్యక్తి 'క్రేజీ'అని తన ఫేస్ బుక్ పేజీతో పోస్ట్ చేశాడు. అదే ప్రస్తుతం అతనికి తొమ్మిది నెలల జైలుశిక్ష అనుభవించేలా చేసింది. సోషల్ మీడియాలో సరదాగా తన భర్త చేసిన ఓ కామెంట్ జైలుకు పంపించిందని అతడి భార్య మీడియాతో ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 23 తన భర్త హ్లెయింగ్ ఈ కేసులో నిందితుడు.
 
వాస్తవానికి అక్కడి టెలికమ్యూనికేషన్ రూల్స్ ప్రకారం.. అధ్యక్షుడిని, ఆ తరహా హోదాలో ఉండే వ్యక్తిని 'ఇడియట్' అని, లేదా 'క్రేజీ' అని ఆన్ లైన్లో సంబోధిస్తూ కామెంట్ చేయడం నేరం కిందకి వస్తుంది. 
 
2013లో టెలికమ్యూనికేషన్ చట్టం ప్రతిపాదించారు. అయితే అప్పట్లో మయన్మార్‌లో సైనిక తరహా నియంతృత్వ పాలన కొనసాగేది. ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ గత మార్చిలో ఎన్నికలు జరిగినా.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొన్ని చట్టాలు కఠినంగా ఉండటం వల్ల సాధారణ పౌరులకు ఇక్కట్లు తప్పడం లేదని ఆంగ్ విన్ హ్లెయింగ్ భార్య ఆరోపించింది.