Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అండమాన్ సముద్ర జలాలపై మృతదేహాలు... విమానశకలాలు

గురువారం, 8 జూన్ 2017 (09:21 IST)

Widgets Magazine
Myanmar plane crash

మయన్మార్ సైనిక విమానం కూలి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, ఈ మృతదేహాలు, సముద్ర శకలాలు సముద్ర జలాలపై తేలాడుతున్నాయి. విమానం కూలిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నౌకలకు ఓ వ్యక్తి, మహిళ, చిన్నారి మృతదేహంతో పాటు లగేజీ బ్యాగ్‌లు, సేఫ్టీ జాకెట్లు, విమానం టైరు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. ఈ ఉదయం 8:25 గంటల ప్రాంతంలో పలువురి మృతదేహాలను గుర్తించినట్టు మయన్మార్ సైనిక ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 
 
మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 100 మందికిపైగా సైనికులు, కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న సైనిక విమానం అండమాన్‌ సముద్రంలో కుప్పకూలిపోయింది. విమానంలో సిబ్బంది సహా 106 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో 12 మందికి పైగా పిల్లలు ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈ విమానం లుంగ్లాన్ తీరానికి సమీపంలోనే కూలింది. ఈ విమాన శకలాల కోసం 9 నేవీ షిప్‌లు, మూడు విమానాలు ఈ విమానం కోసం గాలిస్తున్నాయి. కాగా, మయన్మార్‌ సైనిక విమానాల్లో చాలావరకు పాతబడిపోయాయని, దీనికి నిర్లక్ష్యం తోడవడంతో కాలం చెల్లాయని తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో రాజధాని నెపిడాలో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఎయిర్‌ ఫోర్స్‌ విమానంలో మంటలు చెలరేగి అయిదుగురు సిబ్బంది సజీవ దహనమైన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మానాన్నలతో మాట్లాడేందుకు సెల్ ‌అడిగిందనీ... గర్భిణీని భవనం నుంచి కిందికి తోసేశాడు!

బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సెల్‌ఫోన్ అడిగినందుకు ...

news

నా బిడ్డ నోరు నొక్కిపెట్టి.. 4 గంటల పాటు రేప్ చేశారు.. బాధితురాలి కన్నీటి గాథ

దేశ రాజధానికి సమీపంలో ఉన్న గుర్గావ్‌లో ఇటీవల జరిగిన సామూహిక అత్యాచారం కేసులో సంచలన ...

news

జంటనగరాలపై జలఖడ్గ ధారలు.. నైరుతి కుమ్ముడుతో చిగురుటాకులా వణికిన మహానగరం

హైదరాబాద్‌కు మూడురోజుల్లో రెండో సారి చిల్లుపడింది. నైరుతి రుతుపవనాలు వస్తూ వస్తూ నగరంపై ...

news

కోల్‌కతా మురికివాడలో మొఘల్‌ యువరాణి.. టీస్టాల్‌లో మగ్గిన రాజరికం

రాజరికాలు, రాణి వాసాలు దూరమైతే ఎంత మహరాజులైనా, మహరాణులైనా, వారి వారసులైనా సామాన్యుల ...

Widgets Magazine