గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 మే 2017 (13:43 IST)

ఉత్తర కొరియా మూడో క్షిపణి ప్రయోగం- జపాన్ సముద్ర జలాల్లో పడింది.. కిమ్‍‌పై అబే ఫైర్?

ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ దూకుడును మరింత పెంచారు. ఎవరి మాట వినకుండా.. ప్రపంచ దేశాలను అణు పరీక్షలతో వణికిస్తున్నారు. ఇప్పటికే కిమ్ జోంగ్ అణు పరీక్షలతో అగ్రరాజ్యం అమెరికానే జడుసుకుంటోంది. ఈ నేపథ్యంలో

ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ దూకుడును మరింత పెంచారు. ఎవరి మాట వినకుండా.. ప్రపంచ దేశాలను అణు పరీక్షలతో వణికిస్తున్నారు. ఇప్పటికే కిమ్ జోంగ్ అణు పరీక్షలతో అగ్రరాజ్యం అమెరికానే జడుసుకుంటోంది. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ మరోసారి క్షిపణి ప్రయోగం చేశారు. సోమవారం ఉత్తర కొరియా పరీక్షించిన స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి... 450 కిలోమీటర్లు ప్రయాణించి సరిగ్గా జపాన్ సముద్ర జలాల్లో పడింది. గత మూడు వారాల్లో ఉత్తర కొరియా మూడోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది.
 
అయితే ఈ క్షిపణి ప్రయోగంతో జపాన్ ప్రధాని షింజో అబే కోపానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జోంగ్ కారణణమయ్యారు. అంతర్జాతీయ సమాజం ఎన్నిసార్లు హెచ్చరించినా ఉత్తర కొరియా తమ పద్ధతి మార్చుకోవడం లేదనీ... ఇకపై సహించే ప్రసక్తే లేదన్నారు.


ఉత్తరకొరియాను నిలువరించేందుకు తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. దీంతో జపాన్ మద్దతు లభించిన ఆనందంలో అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ పండుగ చేసుకుంటున్నారు. ఛాన్స్ దొరికితే చాలు ఉత్తరకొరియా ఆట కట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్.. ఇక జపాన్ మద్దతు లభించడంతో కిమ్‌పై దూకుడు పెంచే ఛాన్సుందని తెలుస్తోంది.