బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (10:27 IST)

మియామీలో డోనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహాలు మాయం

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక వర్గం తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తన ప్రచారంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ట్

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక వర్గం తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తన ప్రచారంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ట్రంప్.. నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
 
ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహాలను కొందరు అమెరికాలోని పలు ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేశారు. న్యూయార్క్ నగర పార్కులో ఏర్పాటు చేసిన ట్రంప్ నగ్న విగ్రహం అటువైపుగా వెళ్లేవారిని ఆకర్షిస్తోంది. ఈ వింత విగ్రహాలను చూసేందుకు జనం అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. కొంత మంది ఆ విగ్రహాలను చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు. 
 
ఇదిలావుంటే మియామీలో ట్రంప్ వ్యతిరేకులు వైన్‌వుడ్‌లో ఏర్పాటు చేసిన ఆయన నగ్న విగ్రహాన్ని గురువారం గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్టు మియామీ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొందరు వ్యక్తులు ట్రంప్ విగ్రహాన్ని ఓ ట్రక్కులో ఎక్కిస్తుండగా తాము చూసినట్టు కొందరు సెక్యూరిటీ గార్డులు పోలీసులకు వెల్లడించారు. ట్రక్కు నంబరు ప్లేటును గుర్తించిన పోలీసులు ఆ ట్రక్కు యజమాని గురించి విచారణ చేపడుతున్నారు.