శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (15:11 IST)

మన అమెరికానా... ఇండియానా....? ఒబామాకు మోడీ భగవద్గీత

అవును.. అలా చాలామంది అనుకుంటున్నారు. విదేశీ గడ్డపై 75 నిమిషాల పాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంతో అక్కడ హర్వధ్వానాలు వినిపించాయి. దాదాపు 20 వేల మందిని ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగం అమెరికన్లు ఎంతగానో ఆకట్టుకుంది. ఏ దేశాధినేతకు ఇంతవరకూ లభించని ఆదరణ చూసి అమెరికా మీడియా ఆశ్చర్యపోయింది. ఒక దశలో కొందరు... ఇది మన అమెరికానా.. ఇండియానా అంటూ సెటైర్లు కూడా వేశారంటే అక్కడ మోడీ ప్రసంగం ప్రకంపనాలు ఏ రీతిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 
 
ఇకపోతే శ్వేతసౌధంలో జరిగిన విందు సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక 'భగవద్గీత' ఎడిషన్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు బహుమతిగా ఇచ్చారు. మహాత్మా గాంధీ వివరణతో ఉన్న ఆ పుస్తకాన్ని ఢిల్లీలో తయారుచేయించారు. 1959లో మార్టిన్ లూథర్ కింగ్ భారత్ సందర్శించినప్పటి ఆడియో-వీడియో క్లిప్స్ ను కూడా మోడీ అమెరికా అధ్యక్షుడు ఒబామాకు సమర్పించారు.