గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (16:23 IST)

ఇమ్రాన్ ఖాన్‌ను కలవనున్న నవాజ్ షరీఫ్?!

పాకిస్థాన్‌లో విపక్షాల ఆందోళన పర్వానికి తెరదించేందుకు ప్రధాని నవాజ్ షరీఫ్ నడుం బిగించారు. ఈ క్రమంలో తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. పదవి నుంచి తప్పుకోకపోతే షరీఫ్ నివాసంపై లక్షలాది మందితో దాడి చేస్తామని ఇమ్రాన్ హెచ్చరించడం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో షరీఫ్ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇమ్రాన్‌తో భేటీ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను చల్లబరచవచ్చునని నవాజ్ షరీఫ్ భావిస్తున్నారు. 
 
దేశం కోసమే ప్రధాని... ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశమవ్వాలని నిశ్చయించుకున్నారని పాక్ రైల్వే శాఖ మంత్రి ఖ్వాజా సాద్ రఫీక్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే వీరిద్దరి భేటీ ఎప్పుడనే విషయం ఇంకా తెలియరాలేదు.