శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 21 మే 2015 (16:07 IST)

ప్రకృతి విపత్తులపై భారత్ స్పందన భేష్... అమెరికా పొగడ్తల వర్షం

అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రకృతి విప్పత్తుల సమయంలో భారత స్పందన భేష్ అని అమెరికా పొగడ్తల వర్షం కురిపించింది. నేపాల్‌లో భూకంపం సంభవించిన సమయంలో భారత్ స్పందించిన తీరుపై అమెరికా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భేష్ అంటూ భారత్ విపత్తు నిర్వహణ సామర్థ్యానికి కితాబిచ్చింది. భారతదేశంలో అనుసరిస్తున్న విపత్తు నిర్వహణ విధానాలు అత్యాధునికమైనవని పేర్కొంది. 
 
భూకంపాల బారిన పడిన నేపాల్ పట్ల పొరుగుదేశాలు స్పందన అభినందనీయమని తెలిపింది. అందులోనూ ముఖ్యంగా భారత ప్రభుత్వం, సైన్యం అద్భుతంగా వ్యవహరించాయని కొనియాడింది. ఇదేవిధంగా ఇటీవల కాలంలో ఒడిశాను అతలాకుతలం చేసిన తుపాను సందర్భంగా కూడా భారత్ స్పందించిన తీరు వారి విపత్తు నిర్వహణ సామర్థ్యానికి అద్భుత నిదర్శనమని తెలిపింది. చివరికి కేటగిరీ 5 సూపర్ సైక్లోన్ సంభవించినా, మరణాలు అతి తక్కువగా నమోదయ్యాయని, అది కూడా భారత్ నిర్వహణా సామర్థ్యామేనని తెలిపింది.