శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (10:28 IST)

'డాడీ' అంటూ దగ్గరకెళితే.. కామంతో కాటేశాడు... మానవమృగానికి 16 యేళ్ల జైలు

డాడీ అంటూ దగ్గరకెళితే ఆ మానవమృగం కామంతో కాటేశాడు. తండ్రి స్థానంలో ఉన్నాననే విచక్షణ కూడా మరిచి... ఇద్దరు చిన్నారుల బతుకులను చిద్రం చేశాడు. ఫలితంగా 15 యేళ్ల ప్రాయానికే రెండుసార్లు గర్భస్రావం చేయించాడు.

డాడీ అంటూ దగ్గరకెళితే ఆ మానవమృగం కామంతో కాటేశాడు. తండ్రి స్థానంలో ఉన్నాననే విచక్షణ కూడా మరిచి... ఇద్దరు చిన్నారుల బతుకులను చిద్రం చేశాడు. ఫలితంగా 15 యేళ్ల ప్రాయానికే రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. ఈ దారుణం న్యూజిలాండ్‌లో జరుగగా, ఆ మానవ మృగానికి న్యూజిలాండ్ కోర్టు 16 యేళ్ళ జైలుశిక్ష విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
''డాడీ'' అంటూ అతని వద్దకు వెళ్లింది చిన్నారి సెలెస్టె స్మిత్‌. తండ్రి హేస్‌ రికీ మనామన ఆమెను ఎత్తుకొన్నాడు. లాలించాడు. ఆ దృశ్యం చూసిన తల్లి మనసు కుదుటపడింది. వాస్తవానికి అతను ఆ పిల్లలకు తండ్రి కాదు. 
 
న్యూజిలాండ్‌కు చెందిన ఓ తల్లికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె మొదటి భర్త నుంచి విడాకులు తీసుకొని హేస్ రికీ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఆమె ఇద్దరు ఆడపిల్లలను తండ్రి కాకపోయినా సవతి తండ్రిగా గారాబంగా పెంచుతూ వచ్చాడు. దీన్ని చూసి ఆ తల్లి మరిసిపోయింది. దీంతో ఇంటిపైన పిల్లల చదువుపైనా దృష్టిపెట్టకుండా తన పనుల్లో లీనమైపోయింది.
 
ఇంటి వద్ద జరిగే విషయాలను తల్లి పట్టించుకోకపోవడంతో తన భర్త రికీలోని మృగం బయటకు వచ్చింది. తాను పెంచిన సెలెస్టా 12 ఏళ్ల ప్రాయానికి రాగానే మానభంగం చేశాడు. నిత్యం చిన్నారిని అనుభవించి పైశాచిక ఆనందం పొందేవాడు. దాదాపు ఏడేళ్లపాటు రికీ పైశాచిక క్రీడ సెలెస్టాపై సాగింది. ఫలితంగా 15 ఏళ్లకే రెండు సార్లు గర్భస్రావం జరిగింది. అనంతరం కొన్ని రోజులకు సెలెస్టా సోదరి టియానాను కూడా చెరబట్టాడు. నాలుగు ఏళ్ల నుంచి తండ్రి అనుకున్న నాన్నే అలాంటి పనులు చేస్తుంటే వారి చిన్న హృదయాలు తల్లడిల్లిపోయాయి. సంరక్షకుడే వారిపై లైంగికదాడి జరుపుతుంటే ఏం చేయాలో తోచక మౌనంగా రోధించేవారు. ఇటీవలే ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రికీ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై కేసు నమోదు స్థానిక పోలీసులు కేసు నమోదు చేయగా, న్యూజిలాండ్‌ కోర్టు రికీకి 16 ఏళ్ల జైలుశిక్ష విధించింది. కేసు విచారణ సందర్భంగా అతను ఎలాంటి పశ్చాత్తాపం ప్రకటించకపోవడం గమనార్హం. ఎనిమిదేళ్ల వరకు ఎలాంటి బెయిల్‌ ఇవ్వకూడదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. చిన్నారులని చూడకుండా కేవలం లైంగిక వాంఛతో వారిని పెంచి లైంగికదాడులు జరపడం క్రూరాతి క్రూరమైన నేరంగా న్యాయస్థానం పేర్కొంది.