శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 జులై 2016 (17:50 IST)

నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి జపాన్ కోకోకోలా కొత్త మందు..!

ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ప్రధానంగా ఉద్యోగస్తులకు నిద్రలేమి సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైపోవడంతో వాటికి అలవాటుపడిన వారు నిద్ర

ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ప్రధానంగా ఉద్యోగస్తులకు నిద్రలేమి సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైపోవడంతో వాటికి అలవాటుపడిన వారు నిద్రలేమికి గురవుతుంటారు. ఇలాంటి వారి కోసం జ‌పాన్ కోకోకోలా కంపెనీ కొత్త మందును ప్రవేశపెట్టింది. ఈ డ్రింక్ పేరు ''గ్లేసియా స్లీప్‌ డ్రింక్". ఇందులో ఎల్‌-థియోనైన్‌ అనే ఎమైనో ఆమ్లంలో ఒత్తిడిని, వ్యాకులతను తగ్గించే కారకాలు ఉంటాయి. 
 
జపాన్‌ దేశంలో ఉన్న పని వేళలు బట్టి చాలామంది ఉద్యోగులు నిద్రలేమితో సమస్యతో సతమతమవుతున్నారని గుర్తించిన కోకోకోలా సంస్థ ఈ డ్రింక్‌ను ప్రవేశపెట్టింది. గ్లేసియా స్లీప్‌ వాటర్‌ పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ డ్రింక్‌కు ఇప్పటికే మంచి డిమాండ్‌ ఏర్పడిందట.
 
దీన్ని గుర్తించిన సంస్థ ఎల్‌-థియోనైన్‌ ఉపయోగించి ఈ పానీయాన్ని తయారుచేయగా.. నిద్రలేమితో బాధపడుతున్న వారు నిజంగానే స్లీపింగ్‌ పానీయం పనిచేస్తుందంటూ తెగ తాగేస్తున్నారట. అయితే ఈ పానియం భారత్‌కు ఎప్పుడొస్తుందో మరి.