మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (09:15 IST)

ఇండియాస్ డాటర్ ప్రసారం... బీబీసీకి లీగల్ నోటీసులు..!

భారత ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘించి, నిర్భయ వివాదాస్పద డాక్యుమెంటరీ ఇండియాస్ డాటర్‌ను బీబీసీ బ్రిటన్‌లో ప్రసారం చేసేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం బీబీసీ కి లీగల్ నోటీసులు పంపింది. అయితే దీనితో తమకు సంబంధం లేదని, నిందితుడిని శిక్షించడమే తమకు ముఖ్యమని నిర్భయం తల్లి స్పష్టం చేసింది. 
 
కాగా ‘ఇండియా డాటర్’ డాక్యుమెంటరీని అందరూ చూడాలని నిర్భయ తండ్రి కోరారు. 'ఇండియా డాటర్' ప్రదర్శనపై నిషేధం విధించిన అంశంపై ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ.. డాక్యుమెంటరీ పై ఎందుకు నిషేధం విధించారని ప్రశ్నించారు. 
 
ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని కోరారు. జైలులో ఉన్న వ్యక్తి అలా మాట్లాడగలుగుతున్నాడంటే.. అతనిని స్వేచ్ఛగా వదిలేస్తే ఇంకా ఏమేమీ మాట్లాడతాడో తెలిసేదని (ముఖేష్ సింగ్ ను ఉద్ధేశించి)’ అన్నారు. 
 
బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో భారత సమాజంలో అసలేం జరుగుతుంది. నేరప్రవృత్తి ఏ మేరకు పేట్రేగిపోతుందో చూపించేలా ఉంటుందని తెలిపారు. నిర్భయ ఉదంతం యావత్ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఇండియా డాటర్ డాక్యుమెంటరీని బ్రిటీష్ నిర్మాత లెస్లీ ఉడ్విన్ నిర్మించారని తెలిపారు. 
 
కాగా నిర్భయ నిందితుడు ముఖేష్ సింగ్ ను ఇంటర్వ్యూ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం డాక్యుమెంటరీపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.