శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 నవంబరు 2014 (15:00 IST)

18వ సార్క్ సమావేశాలు : నరేంద్ర మోడీ-షరీఫ్ భేటీ ప్లాన్ లేదు!

18వ సార్క్ సమావేశాలు కాట్మాండ్లో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ భేటీ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ల మధ్య ప్రస్తుతానికి ఎలాంటి భేటీ లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఇరు దేశాల నేతల మధ్య భేటీకి ఇప్పటి వరకు తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని వెల్లడించారు. 
 
ఇటీవల కాలంలో భారత్పై పాకిస్థాన్ తరచుగా కాల్పులకు తెగబడుతు గతంలో ఇరుదేశాలు మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఇరుదేశాల ప్రధానులు సార్క్ సమావేశాలలో భాగంగా భేటీ అయి చర్చించ వచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే అలాంటి ప్లాన్స్ లేవని అక్బరుద్దీన్ తెలిపారు.