మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (10:36 IST)

మరో మిస్సైల్ టెస్ట్ .. ఉత్తర కొరియా దూకుడు.. అమెరికాకు ముచ్చెమటలు

ఉత్తర కొరియా మరోమారు తన సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను తోసిరాజని మరోమారు క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. గురువారం ‘సర్ఫేస్ టు షిప్’ క్షిపణులను పరీక్షించినట్టు ద

ఉత్తర కొరియా మరోమారు తన సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను తోసిరాజని మరోమారు క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. గురువారం ‘సర్ఫేస్ టు షిప్’ క్షిపణులను పరీక్షించినట్టు దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గురువారం ఉదయం పలు సర్ఫేస్ టు షిప్ మిసైళ్లను ఉత్తర కొరియా పరీక్షించిందని, వోన్సన్, గ్యాంగ్‌వోన్ ప్రావిన్స్ సమీపంలో ఈ పరీక్షలు జరిగాయని శత్రుదేశమైన దక్షిణ కొరియా పేర్కొంది. 
 
కాగా, గత ఐదు వారాల్లో ఉత్తరకొరియా నిర్వహించిన నాలుగో పరీక్ష ఇది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలను, అమెరికా బెదిరింపులను బేఖాతరు చేస్తూ కిమ్ ప్రభుత్వం తాజా పరీక్షలు నిర్వహించింది. గతనెల మొదట్లో అమెరికా లక్ష్యంగా దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని నార్త్ కొరియా పరీక్షించి ఉద్రిక్తతలు పెంచింది. గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కిమ్ ప్రభుత్వం రెండు అణుపరీక్షలు, డజన్ల కొద్దీ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఈ తాజా పరీక్షలపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.